
సెపక్‌తక్రా ఉమ్మడి జిల్లా జట్ల ఎంపికలు
సత్తెనపల్లి: జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అండర్–14 , అండర్–17 బాల,బాలికల సెపక్ తక్రా జిల్లా జట్ల ఎంపికలు సత్తెనపల్లి మండలం నందిగామ జిల్లా పరిషత్ పాఠశాల క్రీడా మైదానంలో గురువారం నిర్వహించారు. ఎంపికలకు ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి బాలబాలికల విభాగంలో 150 మంది క్రీడాకారులు హజరయ్యారు. క్రీడా ఎంపికలు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి ఎన్.సురేష్ కుమార్ పర్యవేక్షణలో జరిగాయి. ఎంపికై న క్రీడాకారులు త్వరలో జరగబోయే 69వ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ పోటీలలో పాల్గొంటారని సురేష్ కుమార్ తెలిపారు. సెలక్షన్ కమిటీ సభ్యులుగా పీఈటీలు లాకు పిచ్చయ్య, బి.అనిల్‌దత్తనాయక్, కోనంకి కిరణ్‌కుమార్ వ్యవహరించారు. కార్యక్రమంలో ఆదిత్య ఫిజికల్ ఎడ్యుకేషన్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ దాసరి కోటేశ్వరరావు, హెచ్‌ఎం కాకరపర్తి శ్రీనివాసరావు, వ్యాయామ ఉపాధ్యాయులు గండు సాంబ శివరావు, కోనంకి కిరణ్‌కుమార్, జి.తులసీరామ్‌నాయక్, ఒ.రత్నాకర్, షేక్ మెహబూబి, కె.స్వాతి, సిహెచ్ అనూష, తదితరులు పాల్గొన్నారు.
అండర్ –14 బాల బాలికల జట్లు..
అండర్–14 సెపక్‌తక్రా బాలుర జట్టుకు కె.రాము, టి.కళ్యాణ్‌బాబు, బి.రత్నాకర్, పి. సన్నీ, ఎస్.మహేష్, స్టాండ్‌బైలుగా షేక్.నాగుర్‌వలి, ఎస్.వేణు, జి.పవన్‌కుమార్ ఎంపికయ్యారు. అండర్–14 బాలికల జట్టుకు పి.శ్రీ జర్షిని, కె.తిరుమలభార్గవి, కె.స్వరూప, కె.ప్రశాంతి, పి.వర్షిని స్టాండ్‌బైలుగా ఎ.వేదవతి, ఆర్.సిరివెన్నెల, కె.మాళవిక.
అండర్–17..
అండర్–17 సెపక్‌తక్రా బాలుర జట్టుకు కె.శామ్యూల్ రాజు,ఆర్.సంతోష్ కుమార్, ఎం.ప్రభుదాస్, ఎం.శ్రీశాంత్, బి.మనిధర్, స్టాండ్ బైలుగా వి.సురేంద్ర, బి.అనీల్ కుమార్, ఎ.కిషోర్‌లు ఎంపికయ్యారు. అండర్ –17 బాలికల జట్టుకు పి.గాయత్రి, కె.గీతిక, జి.చిన్మయి, డి.స్వరూప, షేక్.సమీర, స్టాండ్ బైలుగా ఎ.ప్రశాంతి, పి.దివ్యశ్రీ, జి.వర్ష.