
వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి నియోజకవర్గం అనుబంధ విభాగాల
నరసరావుపేట: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ అనుబంధ విభాగల అధ్యక్షులుగా పలువురిని నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు యూత్ వింగ్ అధ్యక్షుడిగా షేక్ ముక్తియార్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా కొణతం స్వాతి, రైతు విభాగానికి బండి కోటి నాగిరెడ్డి, బీసీ సెల్‌కు వేల్పుల వెంకటేశ్వర్లు, ఎస్టీ సెల్‌కు మొగిలి నారాయణ, ఐటీ వింగ్‌కు యర్రం మణికంఠారెడ్డి, గ్రీవెన్స్ సెల్‌కు షేక్ నిజాం మొహిద్దీన్, వాణిజ్య విభాగానికి గోలమూరి వెంకటరామిరెడ్డి నియమితులయ్యారు.
చిలకలూరిపేట: ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడాలోని నాలెడ్జ్ పార్కు ప్రాంతంలోని ఓ ప్రైవేటు వసతి గృహంలో స్నేహితుడి చేతిలో హత్యకు గురైన దివ్వెల దీపక్‌కుమార్(22) అంతిమ యాత్ర కన్నీటి వీడ్కోలుతో గురువారం జరిగింది. చిలకలూరిపేటకు చెందిన దివ్వెల దీపక్‌కుమార్ గ్రేటర్ నోయిడాలోని బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతూ హాస్టల్ గదిలో అతని మిత్రుడు దేవాన్ష్ చౌహాన్ తుపాకీతో కాల్పులు జరిపిన సంఘటనలో మృతి చెందిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి సమయంలో దీపక్‌కుమార్ మృతదేహం చిలకలూరిపేట పట్టణంలోని గాంధీపేటలో ఉన్న అతని నివాసానికి చేరుకుంది. గురువారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. చదువుల్లో చలాకీగా ఉండి, కాలేజీ టాపర్‌గా ఉన్న దీపక్ కుమార్ ఆకస్మిక మృతిపై అతని తల్లిదండ్రులు దివ్వెల రత్తయ్య, నీరజ దంపతులతో పాటు కుటుంబసభ్యులు, బంధుమిత్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. విద్యార్థి మృతదేహాన్ని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ దరియావలి, నాయకులు కొప్పురావూరి పటేల్, తాళ్ల అంజిరెడ్డి, కౌన్సిలర్ షేక్ యూసుఫ్‌ఆలి, వివిధ పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.