
‘జైలు వ్యవస్థ కేవలం భద్రతకే పరిమితం కాకుండా..సంస్కరణలు, పునరావాసానికి వేదికగా మారుతోంది’అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు.

ఈ నెల 9 నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీలో తెలంగాణ జైళ్లశాఖ, బీపీఆర్‌అండ్‌డీ సంయుక్తంగా నిర్వహిస్తున్న 7వ ఆల్ ఇండియా ప్రిజన్స్ డ్యూటీ మీట్–2025 గురువారంతో ముగిసింది.

ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథి బండి సంజయ్, విశిష్ట అతిథి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు తెలంగాణ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, డీజీపీ జితేందర్, జైళ్లశాఖ డీజీ సౌమ్యామిశ్రా, బీపీఆర్‌అండ్‌డీ అడిషనల్ డీజీ రవిజోసెఫ్ లోకూర్, నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అమిత్‌గార్గ్, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాషబిస్త్ పాల్గొన్నారు.

జాతీయస్థాయి పోటీలను ఎంతో ఘనంగా నిర్వహించారని సౌమ్యామిశ్రాను బండి సంజయ్ ప్రత్యేకంగా అభినందించారు.

మూడు రోజులుగా తెలంగాణ పోలీస్ అకాడమీలో నిర్వహించిన డ్యూటీ మీట్‌లో ఓవరాల్ చాంపియన్‌గా తెలంగాణ జైళ్ల శాఖ సత్తా చాటింది.

అన్ని అంశాల్లో కలిపి మొత్తం 28 పతకాలు సాధించగా..అందులో 21 బంగారు పతకాలు, 4 వెండి పతకాలు, 3 కాంస్య పతకాలు ఉన్నాయి.




















