‘విలేకరులే మార్గదర్శకులు’ | - | Sakshi
Sakshi News home page

‘విలేకరులే మార్గదర్శకులు’

Aug 4 2026 1:53 AM | Updated on Aug 4 2026 1:53 AM

భువనేశ్వర్‌: మీడియా సమాజానికి మార్గదర్శకంగా నిలవాలని, ప్రస్తుత సోషల్‌ మీడియా యుగంలో ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా రెండూ కచ్చితమైన, నిష్పక్షపాతమైన వార్తలను అందించడం ద్వారా ప్రజలకు మరింత చేరువగా ఉండాలని ఫైనాన్షియల్‌ న్యూస్‌ భువనేశ్వర్‌ ఎడిషన్‌ ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర శాసన సభ స్పీకరు సురమా పాఢి అన్నారు. రాష్ట్రాభివృద్ధితో పాటు ఆర్థిక విశ్లేషణపై కూడా దృష్టి సారించిన హై టెక్‌ గ్రూప్‌ చైర్మన్‌ డాక్టర్‌ తిరుపతి పాణిగ్రాహి మాట్లాడుతూ అభివృద్ధిలో ఆరోగ్య సంరక్షణ ఒక అంతర్భాగమని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన సమాజం ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థకు బలమైన వారధిగా నిలుస్తుందన్నారు. స్వేచ్ఛను అనుభవిస్తున్నప్పుడు, తమ విధులు, బాధ్యతల పట్ల కూడా అవగాహన కలిగి ఉండాలని పీఐబీ ఏడీజీ అఖిల్‌ కుమార్‌ మిశ్రా అన్నారు. ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడు సుధర్‌ కుమార్‌ పండా మాట్లాడుతూ ఫైనాన్షియల్‌ న్యూస్‌ త్వరలోనే ఒడిశాలో ప్రతి ఇంటి పేరుగా మారుతుందని అన్నారు. అదే విధంగా ఫైనాన్షియల్‌ న్యూస్‌ ఎడిటర్‌ అశోక్‌ కుమార్‌ పండా మాట్లాడుతూ విశ్వసనీయత, పారదర్శకతే మీడియాకు నిజమైన ఆస్తులని అన్నారు. అనేక వార్తాపత్రికల మధ్య తనదైన ప్రత్యేకతను సృష్టించుకోవడం కచ్చితంగా ఒక సవాలుగా నిలుస్తుందన్నారు. అందుకు తమ బృందం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న హైటెక్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌ చైర్మన్‌, అడ్మినిస్ట్రేటివ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సీతారాం మహాపాత్రో మంచి ఆరోగ్యం ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే అంశంపై ప్రసంగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement