మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ పోలీసులు గంజాయి అక్రమ నిల్వల గుట్టును రట్టుచేశారు. అక్రమంగా బయట రాష్ట్రాలకు తరలించేందుకు నిల్వ చేసిన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చిత్రకొండ డ్యాం సమీపంలో
ఈ నెల ఒకటో తేదీ రాత్రి పెట్రోలింగ్ నిర్వహించిన సమయంలో అటవీ ప్రాంతంలో జూట్ సంచుల్లో దాచ్చిన గంజాయిను శనివారం రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం గంజాయిని ఎస్సై సర్వేశ్వర్ బోయి, చిత్రకొండ తహసీల్దార్ ప్రశాంత్ కుమార్ భత్రా సమక్షంలో తూకం వేయగా 775 కిలోలు ఉంది. దీని విలువ 75 లక్షల రూపాయల వరకూ ఉంటుందని పోలీసులు తెలిపారు. అయితే గంజాయి ఎవరిదో తెలియరాలేదని.. దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.


