సరుకు రవాణాలో రాయగడ రైల్వే డివిజన్‌ రికార్డు | - | Sakshi
Sakshi News home page

సరుకు రవాణాలో రాయగడ రైల్వే డివిజన్‌ రికార్డు

Aug 4 2026 1:53 AM | Updated on Aug 4 2026 1:53 AM

జులై నెలలో 13.45 శాతం లోడింగ్‌

పెరుగుదల

రాయగడ: తూర్పు తీర రైల్వే పరిధిలోని రాయగడ రైల్వే డివిజన్‌ సరుకు రవాణాలో మరో కీలక మైలురాయిని చేరుకుంది. 2026 జూలై నెలలో గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే సరుకు లోడింగ్‌లో 13.45 శాతం, రేక్‌ లోడింగ్‌లో 11.32 శాతం వృద్ధిని నమోదు చేసి తన నిర్వహణ సామర్‌ాధ్యన్ని మరోసారి నిరూపించింది. ముఖ్యంగా ఇనుప ఖనిజం, బాకై ్సట్‌ రవాణాలో గణనీయమైన పెరుగుదల నమోదు కావడం డివిజన్‌ పనితీరుకు బలం చేకూర్చింది. రైల్వే డివిజన్‌ విడుదల చేసిన వివరాల ప్రకారం.. 2025 జూలైలో మొత్తం 787 రేక్‌లను లోడ్‌ చేయగా, ఈ ఏడాది జూలైలో ఈ సంఖ్య 707గా ఉంది. దీంతో 80 రేక్‌లు అధికంగా లోడ్‌ చేయబడగా 11.32 శాతం వృద్ది నమోదయ్యింది. అలాగే సరుకు లోడింగ్‌ 2.75 మిలియన్‌ టన్నుల నుంచి 3.12 మిలియన్‌ టన్నులకు పెరగింది. అంటే 13.45 శాతం వృద్ధి సాధించింది. డివిజన్‌లో ప్రధానంగా ఇనుప ఖనిజం రవాణానే అత్యధికంగా కొనసాగుతుంది. జూలై 2026లో ఇనుప ఖనిజం లోడింగ్‌ 2.28 మిలియన్‌ టన్నులకు చేరుకొగా, గత ఏడాదితో పోలిస్తే 0.40 మిలియన్‌ టన్నులు, అంటే 21.3 శాతం పెరుగుదల నమోదయ్యింది. బాకై ్సట్‌ లోడింగ్‌ కూడా 0.17 మిలియన్‌ టన్నుల నుంచి 0.19 మిలియన్‌ టన్నులకు పెరిగి 11.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. ప్రయాణికుల సేవల పరంగా కూడా డివిజన్‌ మెరుగైన పనితీరును కనబరిచింది. జూలై నెలలొ ట్రైన్‌–ఆన్‌ –డిమాండ్‌ 9టిఒడి) ప్రత్యేక కోచ్‌ రైళ్లను విజయవంతంగా నడిపి ప్రయాణికులకు అదనపు సౌకర్యాలు కల్పించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement