బార్‌ అసోసియేషన్‌ పదవులకు నామినేషన్లు | - | Sakshi
Sakshi News home page

బార్‌ అసోసియేషన్‌ పదవులకు నామినేషన్లు

May 4 2026 10:13 AM | Updated on May 4 2026 10:13 AM

కొరాపుట్‌: నబరంగ్‌పూర్‌ బార్‌ అసోసియేషన్‌ పదవులకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 9 పదవులకు గాను 11 మంది నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్ర బార్‌ అసోసియేషన్‌ ఆదేశాల మేరకు 30 శాతం పదవులు మహిళలకు రిజర్వ్‌ చేశారు. అధ్యక్ష పదవికి సంతోష్‌ మిశ్ర, సిరాజుద్దిన్‌ అహ్మద్‌ నామినేషన్లు దాఖలు చేశారు. రానున్న 5వ తేదీ నామినేషన్‌ పత్రాలు పరిశీలన, 8వ తేది ఉపసంహరణ జరుగుతుంది. ఈ ఎన్నికల పరిశీలకులుగా న్యాయ వాదులు సరోజ్‌ కుమార్‌ బెహరా, కిశోర్‌ పట్నయక్‌, ప్రదీప్‌ కుమార్‌ సాహుల వ్యవహరిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement