భువనేశ్వర్: సముద్రంలోకి పోరాదని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ)మత్స్యకారులకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. ఉత్తర కోస్తా వెంబడి 3 రోజుల పాటు సముద్రంలోకి వెళ్లవద్దని ఐఎమ్‌డీ మత్స్యకారులకు తెలియజేసింది. వాతావరణ శాఖ హెచ్చరిక ప్రకారం ఈ నెల 26 నుండి 28 వరకు ఉత్తర కోస్తా ప్రాంతంలో సముద్రంలో అలజడితో కూడిన వాతావరణ సంకేతాలు బలపడుతున్నాయి.ఈ తీరంలో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ గరిష్టంగా గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఈ కాలంలో సముద్రం అల్లకల్లోలంగా లేదా అత్యంత అల్లకల్లోలంగా మారే అవకాశం ఉంది. మత్స్యకారులు తమ భద్రత దృష్ట్యా ఈ నెల 26 నుంచి 28 వరకు సముద్రంలోకి వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించింది. ఈ వ్యవధిలో సముద్రంలో చేపల వేట తదితర కార్యకలాపాలు సమగ్రంగా నివారించాలని స్పష్టం చేసింది.
21 కిలోల
గంజాయి స్వాధీనం
రాయగడ: ఝార్సుగుడ ఎస్పీ గుండాల రాఘవేంద్ర ఆదేశానుసారం ఆపరేషన్ నిషాముక్త ఒడిశా అభిజాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం నాడు జిల్లాలోని బనహార్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన పెట్రోలింగ్‌లొ ముగ్గురు అంతర్‌రాష్ట్ర మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠాను పట్టుకున్నారు. వారి నుంచి 2.094 కిలోల గంజాయితొ పాటు ఒక నాటు తుపాకీ, రూ.4,87,990ల నగదు, ఒక ద్విచక్రవాహనం, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన నిందితులు ఝార్సుగుడ జిల్లాలోని కర్పాబహాల్ ఇందిరా ఆవాస్ కాలనీకి చెందిన మహామ్మద్ కమల్ అలియాస్ కమలుద్దిన్, బనహర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బందాబహాల్ ప్రాంతానికి చెందిన సురేష్ సింగ్, నరేంద్ర ప్రసాద్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఎస్పీ రాఘవేంద్ర ఈ మేరకు పత్రికలకు ప్రకటన విడుదల చేశారు.


