రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్‌లో గల దానవీధిలో గురువారం అర్ధ రాత్రి చోరీ జరిగింది. ఇంటిలో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని దుండగులు ఇంటి వెనుక తలుపులను విరగ్గొట్టి లోపలకు ప్రవేశించారు. ఇంటిలో గల బీరువాను విరగ్గొట్టి 8 తులాల బంగారు ఆభరణాలు, రూ.3 లక్షల నగదును దొంగిలించినట్లు బాధితుడు శంకర్ సేనాపతి కళ్యాణసింగుపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు డాగ్ స్క్యాడ్‌తో సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. బాధితుడు సేనాపతి తన కుటుంబంతో సహా తన బంధువుల ఇంటికి వెళ్లారు. శుక్రవారం తెల్లవారు జామున చేరే సరికి ఇంటి తలుపులు తెరిచి ఉండటం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.


