భువనేశ్వర్: ఒడిశా నదుల ఆధ్యాత్మికత ఆధారంగా సాంస్కృతిక చైతన్య కార్యక్రమం పాయికా మహోత్సవం–2026లో హైటెక్ విద్యా సంస్థల ఒడియా భాషా సాహిత్య విభాగం సీనియర్ అధ్యాపకులు, ఒడిస్సీ నృత్యకారులు డాక్టర్ చిత్తరంజన్ సహాని ఆధ్వర్యంలో కటక్ నృత్య శాల కళాకారుల బృందం ఒడిస్సీ నృత్య రూపకం ప్రదర్శించింది. పురాణాలలో వర్ణించబడిన పాయికా నదీ తీరంలో గత 15 సంవత్సరాలుగా ఫ్రెండ్స్ యూత్ క్లబ్ పాయికా మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆహ్వానం మేరకు డాక్టర్ చిత్తరంజన్ సహాని ఆధ్వర్యంలో నృత్య శాల ఒడిస్సీ నృత్యకారులు డాక్టర్ సంగీత సాహు, అభిలిప్స సెఠి, బైష్ణబి సాహు బృందం ప్రదర్శించిన ఆధ్యాత్మిక, భావోద్వేగభరితమైన ఒడిస్సీ నృత్య ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది.


