ఒకరి పరిస్థితి విషమం
తొలొగుమ్మ ఘాటీ మలుపు వద్ద ప్రమాదం
రాయగడ: సదరు సమితి తొలొగుమ్మ ఘాటీ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న సైకిల్‌ను తప్పించబోయి అదుపుతప్పిన కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలవ్వగా వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం బరంపురం తరలించారు. సమాచారం తెలుసుకున్న కుంభొకోట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బుధవారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం .. కొరాపుట్ జిల్లా జయపురం నుంచి సుమన్ సస్మాల్, మీనతీ సాహు, సునీతసాహు, అలిస్కా సాహులు అస్కా వెళ్లేందుకు కారులో బయలు దేరారు. ఈ క్రమంలో తొలొగుమ్మ ఘాటి మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఒక సైకిల్‌ను తప్పించబోయి కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో సుమన్ సస్మాల్, మీనతి సాహులకు తీవ్రగాయాలయ్యాయి. సునీత సాహు, అలిస్కా సాహులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. బోల్తా పడిన కారులో ఇరుక్కుపోయిన సుమన్, మీనతీసాహులను బయటకు తీయడానికి క్రేన్ సహాయం అవసరమయ్యింది. మీనతి కుడి చేతికి చెందిన రెండువేలు తెగిపొగా సుమన్‌కు తలపై బలమైన గాయాలయ్యాయి. అస్కా వెళ్లేందుకు జయపురం నుంచిబయలు దేరినవీరు రాయగడ జిల్లాలో ప్రమాదానికి గురకావడంతో స్థానికంగా వారి బంధువులకు సమాచారం అందించడంతో వారు ఆస్పత్రికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు.


