సభలో శ్వేత పత్రం సమర్పణ | - | Sakshi
Sakshi News home page

సభలో శ్వేత పత్రం సమర్పణ

Mar 26 2026 7:26 AM | Updated on Mar 26 2026 7:26 AM

సభలో శ్వేత పత్రం సమర్పణ

భువనేశ్వర్‌: రాష్ట్ర హోం శాఖ బుధవారం శాసన సభలో శ్వేత పత్రం ప్రవేశపెట్టింది. 2025లో రాష్ట్రంలోని నేరాల పరిస్థితిపై ఈ శ్వేతపత్రాన్ని ప్రచురించారు. 2024తో పోలిస్తే 2025లో నేరాల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తేలింది. 2025లో రాష్ట్రంలోని నేరాల పరిస్థితిని ఈ శ్వేత పత్రం ప్రతిబింబించింది. 2025లో 2,29,881 నేరాలు నమోదయ్యాయి. వాటిలో అత్యధికంగా 1,55,223 కేసులు క్రిమినల్‌ అభియోగాల కింద దాఖలయ్యాయి. వీటిలో 2,994 అత్యాచార కేసులు ఉన్నాయి. నమోదైన 1,304 హత్య కేసులలో 1,218 కేసులు రుజువయ్యాయి.

ప్రభుత్వంపై కాంగ్రెస్‌ మండిపాటు..

సభలో ప్రవేశ పెట్టిన శ్వేత పత్రం రాష్ట్రంలో కుప్పకూలిన శాంతిభద్రతల వ్యవస్థని బట్టబయలు చేసిందని కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగింది. ప్రభుత్వం వెల్లడించిన శ్వేత పత్రం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నేరాలు పెరిగాయని స్పష్టం అవుతుందని ఆరోపించారు. నేరాలు పెరగడంతో నిరుద్యోగం పెరిగిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో చట్టం అమలు, కార్యాచరణ నిర్వీర్యం అయిందని కాంగ్రెసు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement