సీఎం బలహీనుడు | - | Sakshi
Sakshi News home page

సీఎం బలహీనుడు

Mar 26 2026 7:26 AM | Updated on Mar 26 2026 7:26 AM

● వైద్యశాఖ మంత్రి బలవంతుడు ● కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే తారా ప్రసాద్‌ బాహినీ పతి ఎద్దేవా

● వైద్యశాఖ మంత్రి బలవంతుడు ● కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే తారా ప్రసాద్‌ బాహినీ పతి ఎద్దేవా

కొరాపుట్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత బలహీనుడని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే తారా ప్రసాద్‌ బాహినీ పతి ఎద్దేవ చేశారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వైద్యశాఖ మంత్రి అత్యంత బలవంతుడని అభివర్ణించారు. ఆయనకు న్యూఢిల్లీలో బలమైన లాభీయింగ్‌ ఉందన్నారు. అందుకే ఎస్‌సీబీ మెడికల్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించి 12 మంత్రి చనిపోయినా మంత్రి పదవికి రాజీనామా చేయలేదన్నారు. వాస్తవంగా సీఎం చేతులోనే మంత్రుల రాజీనామా వ్యవహారం ఉంటుందన్నారు. కానీ ప్రస్తుత సీఎంకు అ బలం లేదన్నారు. బతకడానికి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి చావుని కొనితెచ్చుకున్నా ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నార. గత ప్రభుత్వంలో మంత్రులు తప్పు చేస్తే చర్యలు ఉండేవన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో తప్పులను పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా సమావేశాలు కొనసాగించడం ప్రజాస్వామ్య హత్యగా పేర్కొన్నారు. డీలిమిటేషన్‌ బిల్లులో బీజేపీ తమ పార్టీ అభ్యర్థులు గెలుపొందడానికి వీలుగా మార్పులు చేస్తున్నారన్నారు. బీజేడీ పార్టీతో తమకు పొత్తు లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తనదైన పద్ధతిలో పోరాటం చేస్తోందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement