మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంని దండకారణ్య క్రీడా మైదానం అండన్–17 గ్రీష్మకాల క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. జిల్లాలోని ప్రతి సమితి నుంచి క్రీడాకారులను పిలిచి ఎంపిక పోటీలు నిర్వహించారు. వారిలో మల్కన్‌గిరి, కలిమెల, పోడియా నుంచి ఎక్కువ మంది ప్రతిభ కనబర్చారు. వారిలో కొంతమందిని జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఐదు జట్లుగా విభజించి టోర్నమెంట్‌ను అధికారికంగా ప్రారంభించారు. టోర్నమెంట్ 11 రోజులు జరుగుతాయి. ఏప్రిల్ ఐదో తేదీన ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు. కార్యక్రమంలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.డి ఫారుక్, కార్యదర్శి హృదానంద సాహు, భారత్ క్రికెట్ మాజీ మేనేజర్ సత్‌వీర్ సింగ్, కోచ్ విశాల్ మాలాకర్ పాల్గొన్నారు.


