మల్కన్‌గిరి:
జిల్లాలో అన్ని మండీలలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు జరగకపోవడాన్ని నిరసిస్తూ, గ్యాస్, పెట్రోల్ సకాలంలో సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మల్కన్‌గిరి జిల్లా కాంగ్రీస్ కమిటీ బుధవారం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. కలిమెల సమితిలో జిల్లా కాంగ్రెస్ నాయకుడు గోవింద పాత్రో, కలిమెల సమితి కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ మిసీ్త్ర నాయకత్వంలో సీనియర్ కాంగ్రేస్ నాయకులు మాలా మాడీ, ల్యాంప్ అధ్యక్షుడు బుద్రా కబాసి తదితరులు జాతీయ రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేసి రహదారిని దిగ్బంధించారు. పలు దుకాణాలు మూసివేయించారు. సబ్ కలెక్టర్ దూర్యోధన్ బోయి నిరసనకారుల వద్దకు వచ్చి ఈ నెల 30లోగా మండీలో ధాన్యం కొనుగోలు చేస్తామని హమీ ఇచ్చారు.


