ఈదురుగాలులకు దెబ్బతిన్న రేకిల్లు | - | Sakshi
Sakshi News home page

ఈదురుగాలులకు దెబ్బతిన్న రేకిల్లు

Mar 26 2026 7:36 AM | Updated on Mar 26 2026 7:36 AM

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి ఎం.వి 90 గ్రామంలో బుధవారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు సురేంద్ర హరిజన్‌ ఇంటి పైకప్పు (రేకులు) పూర్తిగా ఎగిరిపోయాయి. ఆ సమయంలో అందరూ ఇంటిలోనే ఉన్నారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. సురేంద్రకు కొద్ది నెలల క్రితం జరగిన రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. శస్త్రచికిత్స చేయడంతో సరిగా నడవలేసి స్థితి. కూలి పనులు వెళ్లలేక ఇట్టి వద్దే ఉంటున్నారు. ఇటువంటి కష్ట సమయంలో ఇల్లును కూడా కోల్పాయ్యారు. వీరికి ప్రభుత్వమే స్పందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement