బూర్జ : చీడివలస గ్రామంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఎదుటే గ్రామస్తులు రెండు వర్గాలుగా వీడి వాగ్వాదానికి దిగారు. గ్రామంలో శ్మశానవాటికకు సరైన రహదారి లేదని, యాదవులకు పట్టాలు ఇవ్వడం లేదని, రోడ్లు వెడల్పు లేవని, డ్రైనేజీలు బాగు చేయడం లేదని, పలు సమస్యలు ఉన్నా పట్టించుకోవడంలేదని ఎమ్మెల్యే ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీకాకుళం కల్చరల్: కవితా సాహితీ ఉగాది పోటీల విజేతల వివరాలకు విశ్వసాహితీ కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు కొల్లి రమావతి, వేమన కవితామయం అధ్యక్షుడు మహ్మద్ రఫీ (ఈవేమన) మంగళవారం వెల్లడించారు. చిలకపాలెంలోని శ్రీశివానీ ఇంజినీరింగ్ కళాశాల సెమినార్ హాలులు ఈ నెల 14న ఉదయం 10 గంటలకు పురస్కారాలను ప్రదానం చేస్తామని ప్రకటించారు. 2024 సంవత్సరానికి పడమటీధి నాటకం (మిరప మహేష్ – జగ్గంపేట) ప్రథమ, ఆరవ భూతం (యనమదల శ్రీదేవి– పాలకొల్లు) ద్వితీయ బహుమతికి ఎంపికయ్యాయి. 2025వ సంవత్సరానికి మంటల స్నానం(మౌనశ్రీ మల్లిక్– హైదరాబాద్) ప్రథమ, మౌన పంజరం(స్వాతికృష్ణ సన్నిధి– అనకాపల్లి) ద్వితీయ బహుమతికి ఎంపికయ్యాయి. పురస్కారాల ప్రదానం అనంతరం కవులకు సత్కారాలు, పుస్తక ఆవిష్కరణలు, కళాప్రదర్శనలు, కవితా పఠనాలు జరుగుతాయని నిర్వాహకులు పేర్కొన్నారు.
వైద్యసేవలు మెరుగుపరచాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్), వన్‌స్టాప్ సెంటర్లను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ నమోదైన నెలవారీ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందాల్సిన క్లెయిమ్‌లను పరిశీలించి, వారికి త్వరితగతిన న్యాయం చేకూరేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఆసుపత్రిలోని మానసిక చికిత్స విభాగాన్ని సందర్శించి రోగుల పరిస్థితిని సమీక్షించారు. వైద్యం, పౌష్టికాహారంపై ఆరా తీశారు.


