అనుమానాస్పదంగా విద్యార్థి మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదంగా విద్యార్థి మృతి

Mar 11 2026 7:23 AM | Updated on Mar 11 2026 7:23 AM

అనుమానాస్పదంగా విద్యార్థి మృతి

కొరాపుట్‌: ఆశ్రమ పాఠశాలలో విద్యార్థి అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. మంగళవారం కొరాపుట్‌ జిల్లా సిమిలిగుడ సమితి రెంగా ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సుహాన్‌ ఖోరా(13) మృతి చెందాడు. అచేతనంగా ఉన్న సుహాన్‌ను పాఠశాల సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్య సిబ్బంది ప్రకటించారు. మృతుడి ముఖంపై రక్తం మరకలు ఉండడంతో బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతునికి తండ్రి లేకపోవడంతో తల్లి ఆదరణలో ఉన్నాడని బంధువులు పేర్కొన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement