భువనేశ్వర్: మధ్య ప్రాచ్య వివాదం, ఆందోళనల మధ్య రాజధాని నగరంలో వంట గ్యాస్ బండల కొరత తలెత్తింది. సిలిండర్లు కోసం ఏజెన్సీ వెలుపల వినియోగదారులు బారులు తీరుతున్నారు. స్థానిక ఖండగిరి లింగరాజ్ గ్యాస్ ఏజెన్సీలో గ్యాస్ సిలిండర్లు తీసుకోవడానికి వినియోగదారులు గుమిగూడారు. గ్యాస్ సిలిండర్లు తీసుకోవడానికి ప్రజలు రాత్రంతా నిలబడి ఉన్నట్లు సమాచారం. 20 నుంచి 25 రోజుల కిందట సిలిండర్లు బుక్ చేసుకున్నప్పటికీ హోమ్ డెలివరీ జరగలేదని ఆరోపిస్తున్నారు. దీనివల్ల పంపిణీదారుల కేంద్రం వద్ద బారులు తీరాల్సి వచ్చిందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హోమ్ డెలివరీ సేవలు నిలిపివేశారు. సిలిండర్లు తీసుకోవడానికి గ్యాస్ ఏజెన్సీని సందర్శించాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్ని సొమ్ము చేసుకునేందుకు ఒక్కో బండకు అదనంగా రూ. 110 గుంజి నల్ల బజారు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.


