బికల్ప్‌ ఆధ్వర్యంలో చైతన్య శిబిరం | - | Sakshi
Sakshi News home page

బికల్ప్‌ ఆధ్వర్యంలో చైతన్య శిబిరం

Mar 10 2026 7:15 AM | Updated on Mar 10 2026 7:15 AM

బికల్ప్‌ ఆధ్వర్యంలో చైతన్య శిబిరం

రాయగడ: స్థానిక బికల్ప్‌ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సదరు సమితి జఫాకాల్‌ గ్రామంలో సోమవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ విద్యావేత్త డాక్టర్‌ దుస్మంత్‌ కుమార్‌ మహాంతి, అధ్యాపకురాలు సంజుక్త పంగి, మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ అర్చనా పట్నాయక్‌, వీరబాబు, సతీస్‌కుమార్‌, గౌరీ శంకరరావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ మహంతి మాట్లాడుతూ.. మూభీ కోమ్‌ నహి అనే అంశంపై ప్రసంగించా రు. ముందుగా మహిళ దినోత్సవం సందర్భంగా మహిళలకు అభినందించిన ఆయన సమాజ శ్రేయ స్సుకు మహిళల పాత్ర చాలా కీలకమని అన్నారు. అన్ని రంగాల్లో మహిళలు అగ్రస్థానంలో ఉండేందు కు పోటీ పడుతున్నారని అన్నారు. వంటిళ్లకే పరిమి తం కాకుండా మహిళలు ఇలా తమ కాళ్లపై నిలబడేందుకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. పిల్లల చదువుపై తల్లిదండ్రులు దృష్టిసారించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement