రాయగడ: పరమపూజ్య శ్రీఠాకూర్ అనుకూల చంద్ర దేవ్ 138వ జన్మదిన వేడుకలు సదరు సమితి గౌడో కుండామ్ వద్ద సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భువనేశ్వర్ నుంచి వచ్చిన రుత్విక్ స్వయ్, నృసింహ శ్రీచందన్, సంగీకారుడు కేశవ్ సాహు, సమీర్ రంజన్ బెహర, గుణుపూర్‌కు చెందిన సుధాంశు శేఖర్ మజుందార్, అంబొదల నుంచి వచ్చిన ఇప్పిలి గురునాయుడు తదితర ప్రముఖులు, ఆధఆ్యత్మిక వేత్తలు పాల్గొన్నారు. వక్తలు ప్రసంగిస్తూ ఆధ్యాత్మిక ధొరణిని అవలంభించి సమాజంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పెద్ద సంఖ్యలో అనుకూలచంద్రదేవ్ భక్తులు పాల్గొన్నారు.


