రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం

Mar 8 2026 7:24 AM | Updated on Mar 8 2026 7:24 AM

భువనేశ్వర్‌: నగర శివారులోని పొహలా ప్రాంతం అనంతపురం కూడలి సమీపంలో శనివారం తెల్లవారుజామున ఇసుకతో వస్తున్న ట్రక్కు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు ఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. బాధితుల గుర్తింపులు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదం తర్వాత ట్రక్కు డ్రైవర్‌ అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. బైక్‌ మీద వ్యక్తులు నియాలికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బైక్‌ తీవ్రంగా దెబ్బతింది. దానిపై ఉన్న 3 మంది అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం క్యాపిటల్‌ ఆస్పత్రికి తరలించారు. బైక్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఆధారంగా బాధితులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement