ధాన్యం బస్తాలతో రైతుల నిరసన | - | Sakshi
Sakshi News home page

ధాన్యం బస్తాలతో రైతుల నిరసన

Mar 8 2026 7:24 AM | Updated on Mar 8 2026 7:24 AM

మల్కన్‌గిరి: జిల్లాలోని కోరుకొండ సమితి పలు పంచాయతీలకు చెందిన రైతులు సమితి కార్యాలయం వద్ద ధాన్యం బస్తాలతో శనివారం ధర్నా చేపట్టారు. మండీలు ఏర్పాటు చేసి మూడు నెలలైనా ధాన్యం కొనుగోలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోరుకొండ మండీ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు గోవింద పాత్రో మాట్లాడుతూ.. గత నెల 26వ తేదీన రైతులకు ఇచ్చిన హామీని కోరుకొండ సమితి అధికారి అమూల్య కుమార్‌ సాహు నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. అయితే రోజుకు 1,000 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.

Advertisement
 
Advertisement
Advertisement