భువనేశ్వర్: దేశంలోని కొత్త క్రిమినల్ చట్టాలపై సాధారణ పౌరులకు అవగాహన కల్పించేందుకు ఒడిశా పోలీసులు స్థానిక ఇడ్కో ప్రదర్శన మైదానంలో న్యాయ సంహిత ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనకు అనూహ్య స్పందన వచ్చింది. వివిధ డిజిటల్ డిస్‌ప్లే బోర్డులు, సమాచార ప్యానెల్‌లు మరియు వివరణాత్మక ప్రదర్శనల ద్వారా ప్రజలకు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్) మరియు భారతీయ సాక్ష్య అధికారియం (బీఎస్‌ఎ) కొత్త భారతీయ క్రిమినల్ చట్టాల గురించి వివరించారు. కేంద్ర హోం వ్యవహారాల శాఖ ఆమోదించిన 10 స్టాల్స్‌లో సాధారణ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ ప్రదర్శన ఈనెల 10వ తేదీ వరకు నిరవధికంగా కొనసాగుతుంది.


