పర్లాకిమిడి: మత్తు పదార్థాలతో జీవితం చిత్తు అవుతుందని వక్తలు అన్నారు. నిషా విముక్త భారత్ అభియాన్ పిలుపు మేరకు సామాజిక సురక్షా, దివ్యాంగుల స్వశక్తీకరణ విభాగం ఆధ్వర్యంలో మత్తు వదలండి, ఆరోగ్యంగా ఉండండి నినాదంతో మహారాజా బాలుర ఉన్నత పాఠశాల వద్ద నుంచి కలెక్టరేట్ వరకు చైతన్య ర్యాలీని ఏడీఎం మునీంద్ర హానగ శనివారం ప్రారంభించారు. ఈ ర్యాలీలో స్కూల్ విద్యార్థులతో పాటు ఎన్జీవో సంస్థల ప్రతినిధులు, జిల్లా సామాజిక సురక్షా అధికారి ఉత్సర్ గీతా బోడోరయితో, సబ్ డివిజనల్ సామాజిక సురక్షా అధికారి లక్కోజు సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


