జయపురం: జయపురం మాజెస్టీ కియా, టాటా మోటార్స్, ఒడిశా రక్తదాత మహాసంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం రెండు శిబిరాలు నిర్వహించారు. కియా షోరూం, టాటా మోటార్స్ ప్రాంగణం ఆడిటోరియంలో శిబిరాలు నిర్వహించగా కియా శిబిరాన్ని ఆ సంస్థ ప్రధాన అధికారి మీనకేతన సాహు ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా ఎస్‌బీఐ ప్రాంతీయ మేనేజర్ సుభాష్ చంద్ర బెహరా హాజరయ్యారు. జయపురం సబ్‌డివిజన్ రక్తదాతల మోటివేటెడ్ కార్యదరి్శు ప్రమోద్ కుమార్ రౌళో, నిరంజన్ కుమార్ పాణిగ్రహి రక్త దాన శిబిరాలను పర్యవేక్షించారు. కియా షోరూంలో 24 యూనిట్ల రక్తం సేకరించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ రక్తదాన శిబిరంలో కొరాపుట్ సాహిద్ లక్ష్మణ నాయిక్ వైద్య కళాశాల ఆస్పత్రిలోగల ఒడిశా రక్త దాతల మహాసంఘ ప్రతినిదిలు వి.గంగాధర్, సంజయ సింగ్ రవీంధ్ర మిశ్రలు దాతల నుంచి రక్తం సేకరించారు. అలాగే టాటా షోరూం నిర్వహించిన శిబిరంలో ఒడిశా రక్తదాతల మహాసంఘం జయపురం ప్రతినిధులుక్ష్ మీకాంత గైనీ, అభయ పండ, సునీత పర్యవేక్షణలో వారి బృందం దాతల నుంచి రక్తం సేకరించారు. టాటా షోరూం శిబిరంలో 15 యూనిట్ల రక్తం సేకరించినట్లు వారు వెల్లడించారు.


