రాయగడ: నవ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని స్థానిక ప్రేమ్ పహాడ్ లాఫర్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ బాబూరావు మహాంతి అన్నారు. ప్రేమ్ పహాడ్ వద్ద శుక్రవారం క్లబ్ సభ్యులు నిర్వహించిన బోర్డు సమావేశంలో ఆయన ప్రసంగించారు. నవ్వు ఆరోగ్యానికి ఎంతవరకు ఉపయోగపడుతుంతో అందరికీ అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ క్లబ్‌ను ఏర్పాటు చేయడమైందని అన్నారు. ఎంతోమంది ఉత్సాహంతో క్లబ్‌లో సభ్యులుగా చేరుతుందడడం అభింనదనీయమని అన్నారు. వ్యాయామంతో పాటు నవ్వు కూడా ఎలా ఆరోగ్యానికి సహాయపడుతోందన్న అంశాలకు సంబంధించి బ్యానర్లను పట్టుకుని ప్రేమ్ పహాడ్ వద్ద చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడకు వ్యాయామం, వాకింగ్ కోసం వచ్చే వారికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సభ్యులు అభిమన్యు నాయక్, జయరాం టంకాల, ఉదయ పండ, లాల్‌బిహారీ లెంక పాల్గొన్నారు.


