జాతీయ భద్రతా వారోత్సవాలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

జాతీయ భద్రతా వారోత్సవాలు ప్రారంభం

Mar 6 2026 8:06 AM | Updated on Mar 6 2026 8:06 AM

రాయగడ: తెరువలిలో గల ఇండియన్‌ మెటల్స్‌ అండ్‌ ఫెర్రొఎల్లొయిస్‌ (ఇంఫా) ఆధ్వర్యంలో గురువారం జాతీయ భద్రతా వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. కర్మాగారం ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇండస్ట్రీయల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ఇంజినీర్‌ చిత్తరంజన్‌ బెవురా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు. కర్మాగారం యూనిట్‌ హెడ్‌ జి.వి.రాకేష్‌ వ్యూహాత్మక మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్లాంట్‌లో పనిచేస్తున్న సిబ్బంది భద్రత, వారి సంక్షేమానికి ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ విధులను నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం అంతా కలిసి ప్రమాదాల నివారణా చర్యలు తీసుకోవడంతోపాటు భద్రతలను పాటిస్తామని శపథం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement