కొరాపుట్: కేంద్ర రక్షణ బలగంలో ఒకటైన సీఆర్పీఎఫ్ 64వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిగింది. గురువారం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని జానకీనగర్‌లో సీఆర్పీఎఫ్ 12వ బెటాలియన్ ఆవరణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏడాది కాలంలో విధి నిర్వహణలో అమరులైన వారికి నివాళులర్పించారు. దేశ రక్షణలో సీఆర్పీఎఫ్ జవాన్‌లు ప్రాణాలు పణంగా పెట్టి విధి నిర్వహణ చేస్తున్నారని కమాండెర్ నంద కిశోర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెండో ఇన్‌చార్జి రాజ్‌కుమార్ సోలంకి, డిప్యూటీ కమాండెంట్ ఫిరోజ్ అలీ, ఇన్‌స్పెక్టర్ పీకే సాహు, తదితరులు పాల్గొన్నారు.


