మోడల్‌ స్కూల్‌ విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

మోడల్‌ స్కూల్‌ విద్యార్థుల ప్రతిభ

Mar 6 2026 8:06 AM | Updated on Mar 6 2026 8:06 AM

జి.సిగడాం: జి.సిగడాం మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు ప్రతిభా పరీక్షలో సత్తాచాటారు. న్యూఢిల్లీకి చెందిన ఇంటర్నేషనల్‌ ఇంగ్లిష్‌ ఒలింపియాడ్‌ (ఐఎంఓ) గత ఏడాది జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీ పరీక్షలో 30 మంది విద్యార్థులు హాజరుకాగా.. 8 బంగారు పతకాలు, 10 రజత పతకాలు, 12 కాంస్య పతకాలు సాధించారు. వీరికి ప్రిన్సిపాల్‌ డబ్బీరు గణేష్‌ పట్నాయక్‌, ఆంగ్ల అధ్యాపకులు డీహెచ్‌ సుబ్రహ్మణ్యం పతకాలు, ప్రశంసాపత్రాలను అందించారు. కార్యక్రమంలో తెలుగు అధ్యాపకులు కోట తిరుపతిరావు, సురేష్‌, పిచ్చిక నేతాజీ, మరడ నాగమణి తదితరులు పాల్గొన్నారు.

పతకాలు, ప్రశంసాపత్రాలతో విద్యార్థులు, అధ్యాపకులు

Advertisement
 
Advertisement
Advertisement