7 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

7 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం

Mar 5 2026 7:16 AM | Updated on Mar 5 2026 7:16 AM

ఇద్దరు అరెస్టు

జయపురం: ఏడు క్వింటాళ్ల గంజాయిని జయపురం సబ్‌డివిజన్‌ బొయిపరిగుడ పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారు మల్కనగిరి జిల్లా కలిమెల పోలీసు స్టేషన్‌ ఎం.వి 90 గ్రామం డోనెల్‌ హరిజన్‌, మల్కనగిరి ఆదర్శ కాలనీ రమేష్‌ బాగ్‌ పట్టుబడినట్లు బొయిపరిగుడ పోలీసు అధికారి డొంబురు బత్రిక బుధవారం వెల్లడించారు. పోలీసు అధికారి వివరణ ప్రకారం.. వ్యాన్‌లో కూరగాయల ట్రేల కింద గంజాయి ఉంచి మల్కనగిరి నుంచి బొయిపరిగుడ వైపు వస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసు అధికారి డొంబురుదొర బత్రిక, ఎస్‌ఐ ధీరేంద్ర బారిక్‌ నేతృత్వంలో టీమ్‌ను పంపారు. ఈ టీమ్‌ పెట్రోలింగ్‌ జరుపుతూ.. కామిడిపొదర్‌ గ్రామ కూడలి వద్ద ఉండగా వ్యాన్‌ వస్తుండడంతో అనుమానం వచ్చి అడ్డగించారు. వ్యాన్‌ను పరిశీలించారు. కూరగాయల ట్రేల కిందన గంజాయి ఉంచిన విషయం బయట పడింది. వ్యాన్‌ను పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చి గంజాయిని తూయించగా 7 క్వింటాళ్ల 63 కేజీల 400 గ్రాముల ఉన్నట్లు వెల్లడైందని అధికారి వెల్లడించారు. పట్టుబడిన గంజాయి రూ.5 కోట్ల విలువ ఉంటుందని పోలీసు అధికారి వెల్లడించారు. పట్టుబడిన గంజాయి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకెళ్తుట్లు నిందితులు తెలిపారన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement