8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం

Mar 5 2026 7:16 AM | Updated on Mar 5 2026 7:16 AM

8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం

వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి

విజయనగరం: ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు నగర డిప్యూటీ మేయర్‌, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి తెలిపారు. ఈ మేరకు మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహిస్తామన్నారు. వేడుకల్లో భాగంగా వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందిస్తున్న మహిళలను సత్కరిస్తామని చెప్పారు. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు నేడు అన్ని రంగాల్లో పురుషులుతో సమానంగా రాణిస్తుండడం శుభపరిణామన్నారు. మహిళల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయంగా రాణించేందుకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్‌ వెంపడాపు విజయలక్ష్మి, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు పిన్నింటి కళావతి, కార్పొరేటర్లు తాళ్లపూడి సంతోషికుమారి, దాసరి పద్మావతి, పార్టీ నాయకులు ఎర్రంశెట్టి సునీత, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement