నీటి సంరక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

నీటి సంరక్షణ అందరి బాధ్యత

Mar 5 2026 7:16 AM | Updated on Mar 5 2026 7:16 AM

నీటి సంరక్షణ అందరి బాధ్యత

విజయనగరం: నీటి సంరక్షణ అందరి బాధ్యతని మాజీ ఎంపీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ డీవీజీ శంకరరావు అన్నారు. అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో 42వ డివిజన్‌ కామాక్షి నగర్‌, అయ్యన్నపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ వాటర్‌ ప్లాంట్‌ వద్ద నీటి సంరక్షణ దినోత్సవం సందర్భంగా బుధవారం ఉదయం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్‌ అధ్యక్షుడు సీహెచ్‌ రమణ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్‌ డీవీజీ శంకరరావు మాట్లాడుతూ.. నీటి వనరులను వృథా చేయకుండా.. బాధ్యతాయుతంగా, సమర్థవంతంగా ఉపయోగించుకోవాలన్నారు. వర్షపు నీటిని నిల్వ చేయడంలో అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్‌ 102 గవర్నర్‌ ఎ.తిరుపతిరావు, డిప్యూటీ గవర్నర్‌ తాడ్డి ఆదినారాయణ, జాలీ వాకర్‌ వై. నలమహారాజు, క్లబ్‌ ఉపాధ్యక్షులు పెనుమత్స అప్పలరాజు, జి. సూర్యప్రకాశరావు, క్లబ్‌ కార్యదర్శి కోట్ల ఈశ్వరరావు, జాయింట్‌ కార్యదర్శి ఇందుకూరి అప్పలరాజు, ఎడ్ల శ్రీనివాసరావు, క్లబ్‌ పెద్దలు కోట్ల సత్యనారాయణ, ప్రసాద్‌ పాల్గొన్నారు.

మాజీ ఎంపీ డాక్టర్‌ డీవీజీ

Advertisement
 
Advertisement
Advertisement