
కళలను పరిరక్షించాలి
రాయగడ: సంప్రదాయ కళలను పరిరక్షించి వాటిని నమ్ముకుని ఉన్న కళాకారులను పొత్సాహించాల్సిన బాధ్యత మనందరిదని గుణుపూర్ శాసనస భమా మాజీ ఎంఎల్‌ఏ రఘునాథ్ గొమాంగొ అన్నారు. జిల్లాలొని రామనగుడలొ ఆదివారం సాయంత్రం జరిగిన లొక్ కళా మహొత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రం భిన్న సంసృతులకు ప్రతీ కమని అన్నారు.ఎన్నొ కళలు ,కళాకారులు ఉన్నారని వారి ఆచార వ్యవహారాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని సూచించారు. కళాకారులను ప్రొత్సాహించగలిగితే కళారంగం ముందుకు కొనసాగుతుందని అన్నారు. ఈ సందర్భంగా రాయగడ జిల్లా కళాకారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సుప్రిత్ సంతొష్ బొచ్చ మాట్లాడుతూ కళాకారులను ప్రొత్సాహించేందుకు వేదికగా జిల్లా కళాకారుల సంఘం ఆవిర్భవించిందని అన్నారు . ప్రభుత్వం గుర్తించిన ఈ సంఘం ద్వారా కళాకారులను ఆదుకొవడంతొ పాటు వారిని ప్రొత్సాహించేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. అనంతరం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన లొక్ కళాకారులకు ఘనంగా సన్మానించారు. ఇటువంటి తరహా కార్యక్రమాలు జిల్లాలొ గల 11 సమితుల్లొ నిర్వహించేందుకు సన్నహాలుచేస్తున్నట్లు కళాకారుల సంఘం కార్యదర్శి ప్రియదర్శిని ముయిక అన్నారు.
కార్తీక వ్రతానికి 19 నుంచి దరఖాస్తులు స్వీకరణ
భువనేశ్వర్: పూరీ శ్రీమందిరంలో కార్తీక వ్రతాల కోసం ఈ నెల 19వ తేదీ నుంచి దరఖాస్తు స్వీకరణ ప్రారంభం అవుతుంది. district.odisha.gov.inలో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. భక్తులకు వసతి, దర్శనం, ప్రసాదం కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యంగా ఉన్నవారికి, కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
17 నుంచి హెల్త్ క్యాంపులు
పర్లాకిమిడి: స్వస్థనారీ.. స్వసక్త పరివార్ అభియాన్ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గజపతి జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ నెల 17 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు మహిళలలు, బాలికలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు చేస్తామని జిల్లా ముఖ్య వైద్యాధికారి ఎం.ఎం.ఆలీ సోమవారం తెలియజేశారు. ఆధార్ కార్డుతో స్వస్థ్య కేంద్రానికి వస్తే హృద్రోగం, డయాబిటీస్, ఓరల్, బ్రెస్ట్, సెర్వికల్ క్యాన్సర్లు, అనీమియా, టీబీ, తదితర టాకాలు ఉచితంగా వేస్తామన్నారు. ఈ హెల్త్ క్యాంపులను సద్వినీయోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, రాష్ట్ర మహిళా, శిశు వికాస్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు.
బైకు చోరీ కేసులో..
నిందితులకు మూడేళ్ల జైలు శిక్ష
రాయగడ: బైకు చోరీ కేసులో ఎస్‌డీజేఎం వర్షాదాస్ కేసు విచారించారు. చోరికి సంబంధం ఉన్న నలుగురు నిందితులకు మూడేళ్ల జైలు శిక్షను విధిస్తూ సోమవారం తీర్పును వెల్లడించారు. జైలు శిక్షతోపాటు రూ.10 వేల జరీమానా కింద చెల్లించాలని, లేని పక్షంలో అదనంగా మరో 6 మాసాలు జైలు శిక్షను అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది జనవరి 18న చందిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగావళి నదీ సమీపంలో అడపతిఉగడ గ్రామంలో తొయికా రమేష్‌కు చెందిన బైక్ దొంగతనానికి గురైంది. ఈ మేరకు బాధితుడు చందిలి పొలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు అరుజు పిడిక, సహదదేవ్ మండంగి, బిజయ్ కుమార్ మండంగి, హరేష్ ఖమారీని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఈ కేసును విచారించిన ఎస్‌డీజేఎం వర్షాదాస్ 11 మంది సాక్షులను విచారించిన అనంతరం తీర్పును వెలువరించారు.
ముమ్మరంగా తనిఖీలు
పర్లాకిమిడి: జిల్లాలో గుసాని సమితిలో పలు పంచాయతీలలో సహాకార సంఘాలు, సొసైటీల గోదాముల్లో జిల్లా ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు సోమవారం కూడా తనిఖీలు చేపట్టారు. ప్రాథమిక వ్యవసాయ కో ఆపరేటివ్ పరపతి సంఘాలు (ప్యాక్స్) ఆధీనంలో ఉన్న యూరియా రైతులుకు అందజేయాలని పర్లాకిమిడి తహసీల్దార్ నారాయణ బెహరా ఆదేశించారు. గుసాని సమితిలో సర్దాపురం, కామధేను, అరగఖండి, శైలాడ, బోమ్మిక గ్రామాలలో పరపతి సంఘాలకు వెళ్లి అధికారులు రికార్డులను తనిఖీలు చేపట్టారు. గజపతి జిల్లా నుంచి పొరుగు రాష్ట్రాలకు యూరియా అక్రమంగా తరలివెళ్తుందన్న అభియోగాల మేరకు అధికారులు ఈ చర్యలు చేపట్టారు. జిల్లా ముఖ్య వ్యవసాయ అధికారి రవీంద్ర అదక్, కె.సూరజ్‌కుమార్, ఎ.ఆర్.సి.ఎస్ అధికారి హరిహర శెఠి ఉన్నారు.

కళలను పరిరక్షించాలి