
75 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం
భువనేశ్వర్: భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టిన రోజు పురస్కరించుకుని ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి రాష్ట్ర వ్యాప్తంగా 75 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదిన కానుకగా ఈ కార్యక్రమం చేపట్టడం విశేషం. ఈ సందర్భంగా స్థానిక ఏకామ్ర కళాశాల ప్రాంగణంలో ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమం కింద మొక్కలు నాటారు. పుడమి తల్లి పరిరక్షణకు కృతజ్ఞతపూర్వకంగా ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలనే ప్రధాని పిలుపునకు స్పందిద్దామని సీఎం పేర్కొన్నారు. ఈ కార్యాచరణ ప్రధాని మోదీకి అమూల్యమైన జన్మదిన కానుకగా నిలుస్తుందన్నారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకులతో కలిసి ముఖ్యమంత్రి రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. రక్తదానం మానవాళికి ఉత్తమ సేవగా పేర్కొన్నారు.

75 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం

75 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం