
చిన్నారుల్లో ఆధ్యాత్మికత పెంపొందించాలి
రాయగడ: చిన్నారులకు చదువు, మన సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ఆధ్యాత్మికతపై అవగాహన కలిగేలా తల్లిదండ్రులు కృషి చేయాలని స్థానిక బాలాజీనగర్‌లోని కళ్యాణవేంకటేశ్వర ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు కొత్తకొట చంద్రమౌళి కుముంధాన్ అన్నారు. రెండు రోజులుగా ఆలయ ప్రాంగణంలో ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు ఆధ్వర్యంలో కొనసాగిన శ్రీకృష్ణ జయంతి వేడుకలు మంగళవారం రాత్రితో ముగిశాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కుముంధాన్ మాట్లాడుతూ.. కనుమరుగవుతున్న మన సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ముఖ్యంగా చదువుకునే విద్యార్థుల్లో ఆధ్యాత్మికతపై శ్రద్ధ కలిగేలా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. అనంతరం శ్రీకృష్ణ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో చిన్నారులు వివిధ వేషాధారణలతో అలరించారు. వారి నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. శ్రీకృష్ణ, గొపికల వేషాధారలతో పాటు వారు చేసిన నృత్యాలు ఆనందడొలికల్లో ముంచెత్తాయి. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు రాధాగోవిందునికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నృత్యాల్లో పాల్గొన్న చిన్నారులకు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు చంద్రమౌళి, కార్యదర్శి రాఘవ కుముంధాన్ బహుమతులను అందజేసి వారిని ఉత్సాహపరిచారు.

చిన్నారుల్లో ఆధ్యాత్మికత పెంపొందించాలి

చిన్నారుల్లో ఆధ్యాత్మికత పెంపొందించాలి