
రక్తదాన శిబిరంలో మంత్రి నిత్యానంద గోండ్
పర్లాకిమిడి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజును పురస్కరించుకుని స్థానిక బిజూ పట్నాయక్ కళ్యాణ మండపంలో బుధవారం ఉదయం రక్తదాన శిబిరాన్ని బీజేపీ అధ్యక్షులు నవకిశోరో శోబోరో, మాజీ ఎమ్మెల్యే కోడూరు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, విద్య, గణశిక్షా మంత్రి నిత్యానంద గోండ్ ముఖ్యఅతిథిగా శిబిరాన్ని ప్రారంభించారు.
ఎక్సైజ్ సూపరింటెండెంటు, బీజేపీ శ్రేణులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. మొత్తం 52 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్టు బ్లడ్‌బ్యాంక్ అధికారులు తెలియజేశారు. సీడీఎంవో డాక్టర్ మహ్మద్ ముబారక్ ఆలీ, మాజీ ఎమ్మెల్యే కోడూరు నారాయణ రావు, జిల్లాపరిషత్ మాజీ చైర్మన్ పొట్నూరు లత, కౌన్సిలర్లు బబునా బెహారా, బాలక్రిష్ణ పాత్రో, నృసింహాచరణ్ పట్నాయక్ పాల్గొన్నారు.