రాయగడ: రాయగడ పట్టణాన్ని బుధవారం ఉదయం పొగమంచు కమ్మేసింది. ఎనిమిది గంటల వరకు దట్టంగా కురిసిన మంచుతో పట్టణంలో చీకట్లు అలముకున్నాయి. దట్టంగా కురిసిన మంచుతో రోడ్లు కన్పించకపోవడంతో వాహనాల రాకపొకలకు కొంత ఇబ్బంది ఏర్పడింది. దీంతో వాహనాలు నడిపే సమయంలో లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తెంది. చాలామంది కాలం కాని కాలంలో కురిసిన మంచును ఆస్వాదించారు.
భక్తిశ్రద్ధలతో విశ్వకర్మ పూజలు
రాయగడ: పట్టణంలో బుధవారం విశ్వకర్మపూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక మెయిన్ రోడ్డు వద్ద స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మకు ప్రత్యేక పూజలను చేపట్టారు. అదేవిధంగా ఎలక్ట్రికల్ కాలనీల్లో విశ్వకర్మ పూజలు ఘనంగా జరిగాయి. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు.
నిరుపేదలకు ఆహార పొట్లాల పంపిణీ
రాయగడ: స్థానిక లయన్స్ క్లబ్ అపరాజిత సంస్థ ప్రతినిధులు పట్టణంలోని నిరుపేదలకు ఆహార పొట్లాలను బుధవారం పంపిణీ చేశారు. వివిధ ప్రాంతాల్లో వారిని గుర్తించి సంస్థ సభ్యులు అక్కడకు చేరుకుని ఆహార పొట్లాలను అందించారు. తమ సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా బుధవారం దేశ ప్రధాని నరేంద్రమోదీ జన్మదినోత్సవం సందర్భంగా పేదల ఆకలి తీర్చేందుకు తమవంతు కృషి చేశామని సంస్థ కార్యదర్శి బరాటం అవంతి తెలియజేశారు. పంపిణీ కార్యక్రమంల్లో సంస్థ అధ్యక్షులు జి.రామక్రిష్ణ, కోశాధికారి పి.కల్యాణి ఉన్నారు.
15 అడుగుల నల్లత్రాచు పట్టివేత
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి లుగెల్ పంచాయతీ పరిధిలోని ఎంపీవీ–47 గ్రామంలోని ఓ వేపచెట్టు పైనుంచి భారీ నల్లత్రాచు పాము బుధవారం మధ్యాహ్న సమయంలో దిగుతూ అలజడి సృష్టించింది. దీన్ని చూసిన స్థానికులు భయంతో వణికిపోయారు. వీరిని చూసిన పాము తిరిగి చెట్టుపైకి వెళ్లిపోయింది. వెంటనే కలిమెల అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఎంవీ–79 గ్రామ అటవీ శాఖ గార్డుతోపాటు మరోవ్యక్తి వచ్చి అతి కష్టంపై చెట్టూ ఎక్కి పామును పట్టుకున్నారు. దీని పొడవు 15 ఉందని అటవీ సిబ్బంది తెలిపారు. అటవీ ప్రాంతంలో ఉండాల్సి పాము ఆహారం కోసం జనావాసాల్లోకి వచ్చి చెట్టు ఎక్కిపోయి ఉంటుందని భావిస్తున్నామన్నారు. అనంతరం పామును అటవీ ప్రాంతంలో విడిచి పెట్టారు.
పట్టణాన్ని కమ్మేసిన పొగమంచు
పట్టణాన్ని కమ్మేసిన పొగమంచు
పట్టణాన్ని కమ్మేసిన పొగమంచు