
పరిశుభ్రతతో ఆరోగ్యానికి భద్రత
భువనేశ్వర్: పరిసరాల పరిశుభ్రత జీవితంలో ఓ భాగం కావాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు అన్నారు. బుధవారం స్థానిక రమాదేవి మహిళా విశ్వవిద్యాలయంలో స్వచ్ఛత అభియాన్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్య సమస్యలను నివారించడంలో పరిసరాల పాత్ర కీలకమన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి క్యాంపస్‌ను శుభ్రపరిచారు. వర్సిటీ ప్రాంగణంలో మొక్కలు నాటారు. పోస్టర్ తయారీ పోటీ విజేతలకు బహుమతులు అందజేశారు. విశ్వవిద్యాలయ ఇన్‌చార్జి వైస్–ఛాన్సలర్ చండి చరణ్ రథ్ తదితరులు పాల్గొన్నారు.

పరిశుభ్రతతో ఆరోగ్యానికి భద్రత