
ఉద్ధృతంగా కల్యాణి నది ప్రవాహం
రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్‌లో కళ్యాణి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మూడు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు చేరుతోంది. వంతెనకు నీరు తాకుతుండటంతో సమీప ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎనిమిదేళ్ల కిందట ఇదే తరహా వరదలు రావడంతో కళ్యాణసింగుపూర్ కకావికలమైంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
బీజేడీ నాయకుల నిరసన
రాయగడ: రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని నిరసిస్తూ బీజేడీ శ్రేణులు బుధవారం ఆందోళనకు దిగాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జగన్నాథ సరక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో గుణుపూర్ మాజీ ఎమ్మెల్యే రఘునాథ్ గొమాంగొ, బీజేడీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు జగదీష్ చంద్ర పాత్రో, సీనియర్ నాయకులు, జిల్లా పరిషత్ మాజీ సభ్యుడు పట్నాన గౌరీ శంకరరావు, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి, రాయగడ మున్సిపల్ వైస్ చైర్మన్ శుభ్ర పండ, దేవాషీష్ ఖడంగా, సంతోష్ పాత్రొ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎస్పీ స్వాతి ఎస్.కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. అత్యాచారాలకు సంబంధించి సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను శిక్షించాలని కోరారు.

ఉద్ధృతంగా కల్యాణి నది ప్రవాహం