
నదిలో కొట్టుకుపోయి ఒకరు మృతి
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా మత్తిలి సమితి నాయక్‌గూఢ పంచాయతీ మాలిగూడ సమీపంలో గారియా నదిని దాటే క్రమంలో ఒకరు మృతి చెందారు. గురువారం ఉదయం నీటి నుంచి ఓ మృతదేహం నదిలో కొట్టుకుపోవడం చూసిన స్థానిక మహిళలు కేకలు వేయడంతో సమీపంలో ఉన్న వారు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, మత్తిలి పోలీసులకు సమాచారం అందజేశారు. వారు వచ్చి మృతదేహాన్ని బయటకు తీశారు. ఖోయిర్‌పూట్ సమితి ఫోఢఘాటా పంచాయతీ శూక్రగూడ గ్రామానికి చేందిన హాతి గురుతేలి(50)గా గుర్తించారు. నాయక్‌గూడలో జరిగే వారపు సంతకు వచ్చి తిరిగి వెళ్తుండగా నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని మత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించారు.