
సంస్కృతం సర్టిఫికెట్ కోర్సు ప్రారంభం
ఎచ్చెర్ల : పీఎం ఉష నిధులు సహకారంతో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విశ్వ విద్యాలయం తెలుగు విభాగంలో సంస్కృతంలో సర్టిఫికెట్ కోర్సును గురువారం వైస్ చాన్సలర్ కె.ఆర్.రజనీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంస్కృతం నుంచే హిందీ తదితర భాషలన్నీ ఉద్భవించాయని చెప్పారు. కార్యక్రమంలో వర్శిటీ రిజిస్ట్రార్ బి.అడ్డయ్య మాట్లాడుతూ సంస్కృతం నేర్చుకుని విద్యార్దులు మంచి భవిష్యత్తులో స్థిరపడాలని అన్నా రు. కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.అనూరాధ, ప్రోగ్రామ్ సమన్వయకర్త డాక్టర్ టి.సంతోషి, పావని, తెలుగు భాషా విభాగం సమన్వయకర్త డాక్టర్ పి.లక్ష్మణరావు, ఎన్.లోకేశ్వరి, కె.ఉదయ్‌కిరణ్, బలరాం నాయుడు, ఎం.ప్రకాష్‌రావు, పి.రవికుమార్ పాల్గొన్నారు.