
9 అడుగుల నల్లతాచు పట్టివేత
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితిలోని జాఖాల్‌గూఢ గ్రామంలో దారా పోడియామి అనే వ్యక్తి ఇంటిలోకి గురువారం మధ్యాహ్నం నల్లతాచు ప్రవేశించింది. కుటుంబ సభ్యులు గమనించడంతో స్నేక్ హెల్ప్‌లైన్ సభ్యుడు రాకేష్ హల్దార్‌కు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పామును పట్టుకున్నారు. తూకం వేయగా 6 కిలోల బరువు, 9 అడుగుల పొడవు ఉంది.
సభ్యులకు కాంగ్రెస్ మూడు పంక్తుల విప్ జారీ
భువనేశ్వర్: రాష్ట్ర కాంగ్రెస్ గురువారం పార్టీ శాసన సభ సభ్యులకు ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాలకు హాజరు కావాలని 3 పంక్తుల విప్ జారీ చేసింది. గురువారం ప్రారంభమైన ఈ సమావేశాలు సెప్టెంబర్ 25 వరకు కొనసాగుతాయి. వర్షాకాలం సమావేశాలకు తన 14 మంది సభ్యులందరూ హాజరు కావాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఈ మూడు పంక్తుల విప్ జారీ చేసింది. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో పార్టీ మూడు పంక్తుల విప్ జారీ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ వైఫల్యాలను పేర్కొంటూ 15 మంది ఎమ్మెల్యేల మద్దతుతో శాసన సభ కార్యదర్శి సత్యబ్రత రౌత్ ద్వారా స్పీకర్ సురమా పాఢీకి ఒక లేఖను సమర్పించింది.
విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి
భువనేశ్వర్: ఖుర్దా జిల్లా బొలొగొడొ ప్రాంతంలో 33 కేవీ విద్యుత్ తీగ తగలడంతో ఒక యువకుడు మరణించాడు. మృతుడు ఖంగురియా గ్రామానికి చెందిన జగ్గు పరిడాగా గుర్తించారు. అతడు కొబ్బరి బొండాలు కోస్తుండగా లైవ్ ఎలక్ట్రిక్ వైర్‌కు తగిలి ఈ ప్రమాదం సంభవించిందని ప్రత్యక్ష సాక్షుల కథనం. సహాయక చర్యల్లో అగ్ని మాపక సిబ్బంది చర్యల పట్ల స్థానికులు అసంతృప్తి చెంది ఆందోళనకు దిగడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
గుణుపూర్ ఐటీడీఏ కార్యాలయం ఘెరావ్
రాయగడ: జిల్లాలోని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) కార్యాలయాన్ని కాంట్రాక్టర్లు గురువారం ఘెరావ్ చేశారు. ఐటీడీఏ ద్వారా కేటాయించిన అభివృద్ధి పనులు పూర్తయినప్పటికీ అందుకు సంబంధించిన బిళ్లులు చెల్లించడం లేదని కాంట్రాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఐటీడీఏ జేఈని నిలదీశారు. త్వరలో బిళ్లులను చెల్లించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని కాంట్రక్టర్లు హెచ్చరించారు. వీరికి మద్దతుగా కాంగ్రెస్ నాయకులు రమాకాంత్ మాఝి, తరిణి శతపతి, భీమా జగరంగ, తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ బాలబాలికల సాఫ్ట్‌బాల్ జట్ల ఎంపికలు శుక్రవారం జరగనున్నాయి. శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎంపికలు మొదలవుతాయని జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కూన రవికుమార్, ప్రధాన కార్యదర్శి సూర శ్రీనివాసరావు గురువారం తెలిపారు. 2011 జనవరి ఒకటి తర్వాత జన్మించిన బాలబాలికలు అర్హులని చెప్పారు. ఎంపికై న జిల్లా జట్లను అక్టోబర్ 4 నుంచి 6 వరకు విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం వేదికగా జరిగే ఏపీ రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్స్ బాలబాలికల సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్–2025 పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్/శ్రీకాకుళం: శ్రీకాకు ళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మానసిక ఆరోగ్య విభాగం, వన్ స్టాప్ సెంటర్‌ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు గురువారం సందర్శించారు. రోగులను పరామర్శించి, వారికి అందిస్తున్న వైద్య సేవ లు, పౌష్టిక ఆహార సరఫరా, ఆస్పత్రి పరిసరా ల పరిశుభ్రతపై ఆరా తీశారు. కార్యక్రమంలో డాక్టర్ డి.విజయలక్ష్మి, టి.అలేఖ్య పాల్గొన్నారు.

9 అడుగుల నల్లతాచు పట్టివేత