
మళ్లీ మొదటికే..!
● కొలిక్కిరాని మహానది జలాల
పంపిణీ వివాదం
● విచారణ వాయిదా వేసిన ట్రిబ్యునల్
భువనేశ్వర్: మహా నది జలాల పంపిణీ వివాద పరిష్కారం కొలికి రావడం లేదు. శనివారం ట్రిబ్యునల్‌లో జరిగిన విచారణతో ఈ ప్రక్రియ మళ్లీ మొదటికే వచ్చింది. ఉభయ ఛత్తీస్‌గడ్, ఒడిశా రాష్ట్రాలు చర్చలతో వివాదం సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ఉద్దేశించిన మహా నది జలాల పంపిణీ విచారణని ట్రిబ్యునల్ సెప్టెంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది.
మలుపు తిరిగిన కథ..
దీర్ఘ కాలంగా ఛత్తీస్‌గఢ్‌తో కొనసాగుతున్న మహా నది జలాల పంపిణీ వివాదాన్ని పరిష్కరించడానికి శుక్రవారం అఖిల పక్ష సమావేశం భువనేశ్వర్‌లో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వివిధ రాజకీయ పార్టీలు, వివిధ సామాజిక సంస్థల సభ్యులు హాజరయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న మహా నది జలాల పంపిణీ వివాదం పరిష్కరానికి భారత రాష్ట్రపతి, ప్రధాన మంత్రి జోక్యం చేసుకోవాలని అఖిలపక్ష సమావేశంలో ప్రతిపాదించారు. ట్రిబ్యునల్‌లో ఒడిశా ప్రభుత్వం తరఫున వాదించిన అడ్వకేట్ జనరల్ పీతాంబర్ ఆచార్య గత విచారణలో రెండు రాష్ట్రాల కార్యదర్శులు, రాజకీయ నాయకుల మధ్య చర్చలు జరిపిన తర్వాత సామరస్యపూర్వక చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని ట్రిబ్యునల్‌కు తెలియజేశారు. ఆగస్టులో వివాద పరిష్కారంలో పురోగతి గురించి రెండు రాష్ట్రాలు ట్రిబ్యునల్‌కు తెలియజేసిన తర్వాత తదుపరి విచారణను నిర్వహించాలని ట్రిబ్యునల్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్ శనివారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, రాజకీయ నాయకుల మధ్య చర్చలు పురోగతిలో ఉన్నాయి. పరిష్కారానికి రెండు పార్టీలు అంగీకరించాయని అడ్వకేట్ జనరల్ పీతాంబర్ ఆచార్య ట్రిబ్యునల్‌కు తెలియజేశారు. ఈ వివాదం పరిష్కారానికి ఒడిశా,