
ఉత్తర ప్రత్యుత్తరాలు..
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, శాంతియుత పరిష్కారం కనుగొనే లక్ష్యంతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం తర్వాత ట్రిబ్యునల్ ఉభయ పక్షాలకు స్వల్ప సడలింపు ఇచ్చింది. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అధ్యక్షతన జరిగిన సమావేశం ముసాయిదా వివరాలతో ఈ ఏడాది జూలై 25 నాటి లేఖను సమర్పించిన ఒడిశా అడ్వకేట్ జనరల్ పీతాంబర్ ఆచార్య సమర్పించిన విషయాన్ని ట్రిబ్యునల్ గమనించింది. ఇందులో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయికి పంపిన సామరస్య పరిష్కారం కోసం ప్రతిపాదన జోడించారు. పరిష్కార చర్చల స్థితిని ట్రిబ్యునల్‌కు తెలియజేయడానికి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సంబంధిత కార్యదర్శులను విచారణకు హాజరు కావాలని కోరారు. ఛత్తీస్‌గడ్ ముఖ్యమంత్రి ఈ నెల 1న స్పందించారు. ఛత్తీస్‌గఢ్ తరపు సీనియర్ న్యాయవాది కూడా వివాద పరిష్కారాన్ని తమ ముఖ్యమంత్రి సమీక్షిస్తున్నారని ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో చర్చలకు మరింత సమయం ఇవ్వడం సముచితమని ట్రిబ్యునల్ పరిగణించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 6 ఉదయం 11 గంటలకు జరగనున్న తదుపరి విచారణ సందర్భంగా పురోగతిపై ట్రిబ్యునల్‌కు తాజా సమాచారంతో కూడిన వివరాలు దాఖలు చేయాలని ట్రిబ్యునల్ రెండు రాష్ట్రాలను ఆదేశించింది.