
ఆదివాసీ ఉత్సవాల ప్రచార రథం ప్రారంభం
రాయగడ: ఈ నెల తొమ్మిదో తేదీన జరగనున్న విశ్వ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ప్రచార రథాన్ని అధికారులు ప్రారంభించారు. స్థానిక మజ్జిగౌరీ మందిరం వద్ద ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆదివాసీ సంప్రదాయ ఉత్సవాలను అందరికీ తెలియజేసేందుకు ఈ ప్రచార రథం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ అవగాహన కల్పిస్తుంది. ఆదివాసీ నాయకులు లాల్‌బిహారి హిమిరిక, తపన్ పెద్దింటి, మంజులా మినియాక, జలంధర్ పుషిక, చక్రధర్ బిడిక తదితరులు పూజల్లొ పాల్గొని రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు.
ఐదు ప్రతిపాదనలకు ఆమోదం
భువనేశ్వర్: ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అధ్యక్షతన 23వ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం శుక్రవారం లోక్ సేవా భవన్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగింది. ఇందులో తీసుకున్న నిర్ణయాలపై ప్రముఖ కార్యదర్శి మనోజ్ అహుజా మీడియాకు వివరించారు. మంత్రి మండలి సమావేశంలో చర్చ తర్వాత 4 విభాగాల నుంచి 5 ప్రతిపాదనలు ఆమోదించబడ్డాయి. వాటిలో జలవనరులు, సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమలు, ఆర్థిక శాఖల నుంచి ఒక్కో ప్రతిపాదన, న్యాయ శాఖ నుంచి 2 ప్రతిపాదనలను మంత్రి మండలి ఆమోదించినట్లు మనోజ్ ఆహుజా పేర్కొన్నారు.
ఎన్‌ఐఏ డిప్యుటేషన్ ఎస్పీగా ఐపీఎస్ సాగరికా నాథ్
భువనేశ్వర్: ఖుర్దా జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఒడిశా కేడర్, 2016 బ్యాచ్ ఐపీఎస్ సాగరిక నాథ్ కేంద్ర డిప్యుటేషన్ ప్రాతిపదికన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)గా నియమితులయ్యారు. ఈ మేరకు హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు స్వీకరించేందకు వీలుగా వెంటనే రిలీవ్ చేయాలని ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ జారీ అయింది. రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్, జాతీయ దర్యాప్తు బృందం ఎన్‌ఐఏ సమన్వయంగా వ్యవహరించాలని హోం శాఖ పేర్కొంది. ఈ నియామకంతో భారత దేశ ప్రధాన ఉగ్రవాద నిరోధక సంస్థలో అత్యున్నత జాతీయ భద్రతా కేసుల నిర్వహణలో సాగరిక నాథ్ దక్షత మరింత మెరుగుపడనుంది.
సమస్యలు పరిష్కరించండి
పర్లాకిమిడి: పర్లాకిమిడి పురపాలక సంఘం వార్షిక స్వతంత్ర సమావేశం మున్సిపల్ చైర్‌పర్సన్ నిర్మలా శెఠి అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, పురపాలక ఈఓ లక్ష్మణ ముర్ము, వైస్ చైర్మన్ లెంక మధు, 16 వార్డుల కౌన్సిలర్లు హాజరయ్యారు. పర్లాకిమిడి పట్టణం అతి పురాతన మైందని, దీనిని అందంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే రూపేష్ అన్నారు. పట్టణంలో డ్రైనేజీల మరమ్మతులు, శంకర్‌బాస్ చెరువు, పట్నాయక్ చెరువు పుణరుద్ధరణ పనులు వేగవంతం చేయాలన్నారు. అనేక వార్డులలో వీధి దీపాలు వెలగటం లేదని, వీటి స్థానంలో కొత్తవి వేయాలని మున్సిపల్ ఈఓ ముర్మును కోరారు.

ఆదివాసీ ఉత్సవాల ప్రచార రథం ప్రారంభం

ఆదివాసీ ఉత్సవాల ప్రచార రథం ప్రారంభం

ఆదివాసీ ఉత్సవాల ప్రచార రథం ప్రారంభం