
బిజూ చత్రో జనతాదళ్ కార్యకర్తల ఆందోళన
రాయగడ: జిల్లాలోని గుణుపూర్‌లో బిజూ చత్రో జనతాదళ్ కార్యకర్తలు శుక్రవారం గుణుపూర్ ఆదర్శ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలోని బీజేపీ పాలనలో మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు, దాడులను నిరసిస్తు చేపట్టిన ఆందోళనలో భాగంగా పోలీస్ డీజీ పేరిట వినతిపత్రాన్ని గుణుపూర్ ఆదర్శ పోలీస్ స్టేషన్ ఐఐసీ కేకేబికే కుహరోకు చత్రో జనతాదళ్ నాయకులు అందించారు. అధికార పగ్గాలు చేపట్టిన బీజేపీ ప్రభుత్వంలు మహిళలకు రక్షణ కరువయ్యిందని, శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని వినతిపత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో చత్రో జనతాదళ్ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు విష్ణుపండ, నాయకుడు కె.కిరణ్ కుమార్, కౌన్సిలర్ శివప్రసాద్ పాడి, సనోబౌరి, సమితి బీజేడీ అధ్యక్షుడు గోవర్దన్ సోబోరో పాల్గొన్నారు.