
పరిసరాల పరిశుభ్రతతోనే మెరుగైన సమాజం
జయపురం: పరిసరాల పరిశుభ్రతతోనే మెరుగైన సమాజం సాధ్యమని జయపురం ఎమ్లల్యే తారా ప్రసాద్ బాహిణీపతి అన్నారు. జయపురం సమితిలో ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించేందుకు బ్యాటరీ వాహనాలను శనివారం ప్రారంభించారు. స్థానిక సమితి కార్యాలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. మలేరియా, డెంగీ, చికిన్‌గునియా, అతిసారం మొదలగు వ్యాధులు పరిశుభ్రత లేమి కారణంగానే వ్యాపిస్తాయన్నారు. అందుకే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు దరిచేరవన్నారు. సమితిలోగల 22 పంచాయతీలకు 22 వాహనాలను సమకూర్చినట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు. మరో పది బ్యటరీ వాహనాలను తెప్పించేందుకు నిధులు మజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. గ్రామ పంచాయతీల అధికారులు, సమితి సిబ్బంది పాల్గొన్నారు.