
మహిళ పేరుతో ఫేక్ ఇన్‌స్టాగ్రామ్
● ఇద్దరు యువకుల అరెస్టు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి సోమానాథ్‌పూర్ పంచాయతీ ఎం.వి–36 గ్రామానికి చెందిన ఓ వితంతు మహిళ పేరుపై ఆదే గ్రామానికి చేందిన ఇద్దరు యువకులు ఇన్‌స్ర్ట్రాగామ్ ఖాతా ఓపెన్ చేశారు. ఆమె ఫొటోను ఎడిట్ చేసి అసభ్యకరమైన పోస్టులు చేస్తున్నారు. ఈ విషయంపై ఆమె జూన్‌లో బలిమెల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఐఐసీ ధీరజ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం సుజాన్ ముజుంధార్, సంజిత్ హోల్ద్‌ర్‌ను అరెస్టు చేశారు. వీరిద్దరూ ఫోన్ ద్వారానే ఫేక్ ఇన్‌స్ర్ట్రాగామ్ నడుపుతుట్లు గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసి విచరణ చేపట్టారు. అనంతరం కోర్టుకు తరలిస్తామని ఐఐసీ ధీరజ్ తెలిపారు.