
చోరీ కేసులో నిందితుని అరెస్టు
రాయగడ: చోరీ కేసుకు సంబంధించి సదరు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తి స్థానిక ఇందిరానగర్ మూడో లైన్ లొ నివాసముంటున్న బడుమూరు మనికంట్ సుబుధ్ది గా గుర్తించారు . అతని నుండి 32 వేల రుపాయల నగదు, స్టీల్ బాక్స్‌లో గల 600 రుపాయల నాణాలు, ఒక బంగారు లాకెట్, బంగారు పూత గల లక్కీ బొన్, వెండి పట్టీలు, 40 వెండి కాయిన్లు, 8 వెండి ఆభరణాలు, రెండు రొల్డ్ గొల్డ్ ఆభరణాలు, ఒక మోబైల్ ఫొన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి కొర్టుకు తరలించారు. సదరు పోలీస్ స్టేషన్ ఐఐసి ప్రశన్న కుమార్ బెహర తెలియజేసిన వివరాల ప్రకారం...గత నెల 26 వ తేదిన స్థానిక పంచవటి నగర్ లొ నివాసముంటున్న బి గంగారావు అనే వ్యక్తి ఇంటిలొ చొరీ జరిగింది. దీనికి సంబంధించి బాధితుడు పోలీస్ స్టేషన్ లొ ఫిర్యాదు చేసాడు. ఇంటిలొ ఎవరూ లేని సమయంలొ గుర్తు తెలియని దుండగులు ఇంటిలొ చొరబడి ఇంటిలొ గల 1,30,00ఏ రుపాయల నగదు, 4 వెండి ప్లేట్లు, మూడు జతల చెవి దిద్దులు దొంగతనం జరిగినట్లు బాధితుడు ఫిర్యాదు చేసాడు . దీనిపై కేసు నమోదు చే సిన పోలీసులు ఈ మేరకు దర్యాప్తు చేపట్టారు.